KMM: నేషనల్ ట్రాన్సిట్ పర్మిట్ల జారీలో ఉన్న లొసుగుల ఆధారంగా అనుమతి ఉన్న కలప మాటున విలువైన కలపను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు ఇటీవల బయటపడింది. ఈ అంశంపై జిల్లా అధికారులు ఇప్పటికే విచారణ పూర్తిచేయగా, భద్రాద్రి జోన్ సీసీఎఫ్ భీమానాయక్ బుధవారం ఖమ్మం వచ్చారు. తప్పుడు పత్రాలు సృష్టించడానికి అక్రమార్కులు ఎంచుకున్న మార్గాలపై చర్చించారు.