KRNL: ఎమ్మిగనూరు మండల చెన్నాపురం గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారి 167పై ఆదోని నుంచి ఎమ్మిగనూరుకు వస్తున్న మినీ గూడ్స్ వాహనం ఓ వ్యక్తిని ఢీకొట్టింది. దీంతో గాయపడ్డ వ్యక్తిని స్థానికులు ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మృతి చెందగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.