TPT: తాజ్ హోటల్లో బుధవారం నుంచి రెండు రోజులపాటు జాతీయ సహకార మంత్రిత్వశాఖ వర్క్ షాప్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ.. సహకారం రంగం బలోపేతం, వివిధ పథకాల అమలుపై సమీక్షించేందుకు త్రైమాసిక సమావేశం జరుగుతుందని వెల్లడించారు. జాతీయ సహకార మంత్రిత్వశాఖ సెక్రటరీ ఆశిష్ కుమార్ భుటానీ పాల్గొననున్నట్లు వివరించారు.