AP: వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులకు మాచర్ల రూరల్ పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. గుండ్లపాడు జంట హత్యల కేసులో ఈరోజు విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. కాగా, ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు ఈరోజుతో పూర్తి కానుంది. సుప్రీంకోర్టులో రిలీఫ్ రాకపోతే విచారణ తర్వాత వారిని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.