BHPL: కాటారం మండల కేంద్రంలోని ATC కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ , అదనపు కలెక్టర్ విజయలక్ష్మి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలోని పలు రూములను పరిశీలించిన కలెక్టర్, నిర్వహణలో పారదర్శకత, సమర్థత పాటించాలని, నిర్లక్ష్యానికి తావులేదని హెచ్చరించారు. విద్యార్థుల శిక్షణకు అవసరమైన సదుపాయాల ఏర్పాటును వేగవంతం చేయాలని సిబ్బందికి ఆదేశించారు.