ప్రకాశం: రెవెన్యూ అంశాల ప్రజా సేవల పనితీరుపట్ల ప్రజలు పూర్తి సంతృప్తి వ్యక్తం చేసేలా ప్రత్యేక దృష్టి సారించాలని సీసీఎల్ఏ ప్రత్యేక కార్యదర్శి జయలక్ష్మి మంగళవారం జిల్లా కలెక్టర్లకు సూచించారు. విజయవాడ సీసీఎల్ఏ కార్యాలయం నుంచి అన్నదాత సుఖీభవ, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, పలు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.