SRD: మండల కేంద్రమైన ఝరాసంగంలోని శ్రీ కేతకి ఆలయంలో బుధవారం ఉదయం అర్చకులు స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. ఆశ్వయుజ మాసం, కృష్ణపక్షమి, పాడ్యమి తిథి పురస్కరించుకొని పార్వతి సంఘమేశ్వర స్వామికి ప్రత్యేక పంచామృతాలతో అభిషేకం, సుగంధ పుష్పాలతో అలంకరించి మంగళహారతి నీరాజనం చేశారు.