NLG: ఇటీవల కురిసిన భారీ వర్షం కారణంగా డిండి మండలం కందుకూరు వాగులో మిషన్ భగీరథ పైప్ లైన్లు దెబ్బతినగా నీటి సరఫరా నిలిచిపోయిన గ్రామాలకు. ప్రత్యామ్నాయ పద్ధతిలో ట్యాంకర్లు, బోర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. మంగళవారం ఆమె కందుకూరు వాగులో దెబ్బతిన్న మిషన్ భగీరథ పైప్ లైన్ స్థలాన్ని పరిశీలించారు.