అన్నమయ్య: చిట్వేలి మండల సర్వసభ్య సమావేశం నేడు ఉదయం 10 గంటలకు నిర్వహించబడనని MPDO శ్రీనివాసులు మంగళవారం తెలిపారు. సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పాల్గొననుండగా, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్లు తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన స్పష్టం చేశారు. అంతేకాక, మండల స్థాయి అధికారులు తమ శాఖలకు సంబంధించిన పూర్తి సమాచారంతో సమావేశంలో పాల్గొనాలన్నారు.