KMM: వ్యవసాయ మార్కెట్లోని పత్తి యార్డులో ప్రస్తుతం మిర్చి కొనుగోళ్లు జరుగుతుండగా, మిర్చి యార్డుకే మారుస్తూ మార్కెట్ కమిటీ నిర్ణయించింది. పత్తి విక్రయాలు పెరిగిన నేపథ్యాన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు మార్కెట్ ఛైర్మన్ హనుమంతరావు, ఉన్నత శ్రేణి కార్యదర్శి సమావేశమై ఏసీ మిర్చి నమూనాల పరిశీలనకు తిరిగి మిర్చి యార్డునే వినియోగించాలని నిర్ణయించారు.