KRNL: రానున్న 5 రోజుల్లో కర్నూలు ఉమ్మడి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 8 నుంచి 12 వరకు 4 మి.మీ నుంచి 15 మి.మీ వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు 31.8° నుంచి 32.6 ° సెల్సియస్ వరకు ఉండనుండగా, నంద్యాలలో కొద్దిగా ఎక్కువగా నమోదయ్యే అవకాశముందన్నారు.