SS: పుట్టపర్తి మండలం వెంగళమ్మచెరువులో ఇవాళ ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. సిమెంట్ లోడు దించి లారీని రివర్స్ పెడుతున్న సమయంలో మొహబ్ బీ (70) ప్రమాదవశాత్తు వెనుకపడటంతో టైరు ఆమెపైకి వెళ్లి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన స్థానికుల్లో తీవ్ర విషాదాన్ని కలిగించింది. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు.