WNP: 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఉత్తమ ఉర్దూ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వనపర్తి డీఈవో అబ్దుల్ ఘని తెలిపారు. ప్రభుత్వ ప్రాథమిక/ఉన్నత పాఠశాలల్లో బోధించే అర్హులైన ఉపాధ్యాయులు ఈరోజు బుధవారం నుంచి ఈ నెల 14 వరకు దరఖాస్తులు సమర్పించాలని ఆయన కోరారు. ఈ దరఖాస్తులను తెలంగాణ ఉర్దూ అకాడమీకి పంపనున్నారు.