AP: పోలవరం-బనకచర్ల ప్రాజెక్టులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. డీపీఆర్ తయారు చేసేందుకు కన్సల్టెన్సీ నియామకానికి ఇ-ప్రొక్యూర్మెంట్ టెండర్లను జలవనరులశాఖ ఆహ్వానించింది. కేంద్ర జలసంఘం మార్గదర్శకాల ప్రకారం నివేదిక సిద్ధం చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి అనుమతులు తీసుకురావాల్సిన బాధ్యత కూడా ఆ కన్సల్టెన్సీకే అప్పచెబుతారు.