ఏలూరు: గడిచిన 24 గంటల్లో ముదినేపల్లిలోఅ 21.2 మి.మీ అత్యధిక వర్షపాతం నమోదైందని అధికారులు బుధవారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 24.4 మి.మీ వర్షపాతం నమోదు కాగా, సరాసరి వర్షపాతం 0.9 మి.మీ అన్నారు. అత్యల్పంగా కుక్కునూరు 3.2 మి.మీ వర్షపాతం నమోదైందని తెలిపారు. మిగిలిన 26 మండలాల్లో ఎటువంటి వర్షపాతం నమోదు కాలేదన్నారు.