SRPT: చివ్వేంల మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల కోడ్ అమలు పై సరైన పర్యవేక్షణ లేదని పలువురు నాయకులు ఆరోపిస్తున్నారు. బద్య తండా గ్రామ పంచాయతీలో విద్యుత్ స్తంభాలకు వివిధ పార్టీల ఫ్లెక్సీలు తొలగించకుండా ఉండడం ఆశ్చర్యకరం. గ్రామపంచాయతీలలో పంచాయతీ కార్యదర్శి పర్యవేక్షణ లోపం కళ్లకు కట్టినట్లు దర్శనమిస్తున్నాయని స్థానికులు మండిపడుతున్నారు.