KMR: జుక్కల్, బిచ్కుంద, డోంగ్లీ మద్నూర్ మండలాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షానికి సోయా పంట తీవ్రంగా దెబ్బతింది. సెప్టెంబరులో ఏకధాటిగా కురిసిన వర్షాలకు చేతికొచ్చిన పంటంతా అడ్డం పడి, నీటిలో మునిగిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “సోయా ఆగయా.. పురా గయా” అంటూ కన్నీరు పెట్టుకున్నారు. నాలుగు గింజలు కూడా రావని అన్నదాతలు ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.