KMR: నిజాంసాగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి 9, 11వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల గడువు ఈనెల 21 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ రాంబాబు తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 2025-26 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 8, 10వ తరగతి చదివిన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు.