SKLM: కొత్తూరు కేజీబీవీ పాఠశాల ప్రిన్సిపాల్ రాధిక, అకౌంటెంట్ శ్రీ దేవిలను విధుల నుంచి తొలగిస్తూ సమగ్ర శిక్షా ఏపీసీ ఎస్. శశి భూషణ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల పాఠశాలలో ఎమ్మార్వో తనిఖీలు నిర్వహించగా 1,400 కిలోల బియ్యం పట్టుకున్నారు. తహసీల్దారు సమగ్ర శిక్షా ఏపీసీకి నివేదిక పంపగా, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విధుల నుంచి తప్పించారు.