TPT: శ్రీవారి ఆలయంలో ఈ నెల 20వ తేదీన దీపావళి పండుగ సందర్భంగా దీపావళి ఆస్థానం నిర్వహించనున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమం కారణంగా, ఆ రోజున ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం వంటి అన్ని రకాల ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, స్వామివారికి జరిగే తోమాల,అర్చన సేవలను మాత్రం ఏకాంతంగా నిర్వహిస్తామని టీటీడీ తెలిపింది.