TG: అడ్లూరి లక్ష్మణ్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి స్పందించారు. ‘లక్ష్మణ్ అంటే వ్యక్తి కాదు.. ఒక సామాజిక వర్గం. లక్ష్మణ్‌ను కించపరచడం అంటే దళిత వర్గాన్ని కించపరిచినట్లే. మంత్రి పొన్నం వ్యక్తిగతంగా నాకు సన్నిహితుడు. పొన్నం తన మాటను వెనక్కి తీసుకుంటే గౌరవంగా ఉంటుంది’ అని సూచించారు.