NLG: కామ్రేడ్ రాములు స్తూపాన్ని చింతపల్లి మండలం హరిజనాపురంలో మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు మంగళవారం ఆవిష్కరించారు. సీపీఐ బలోపేతానికి రాములు చేసిన సేవలను నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి మండల కార్యదర్శి పోలే వెంకటయ్య, సహాయ కార్యదర్శి ఉజ్జిని అంజల్ రావు, పార్టీ నాయకులు మరియు రాములు కుటుంబ సభ్యులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.