ATP: సన్ రైస్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జరిగిన అండర్ 17 బాల, బాలికల బాడ్మింటన్ ఛాంపియన్షిప్ తుది పోటీల్లో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ట్రోఫీలతో పాటు ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున అందించారు. బాలుర విభాగంలో వెంకట ప్రణీత్, బాలికల విభాగంలో గగనశ్రీ చౌదరి విజేతలుగా నిలిచారు.