తిరుపతిలోని SV జూ పార్కులో పదిహేనేళ్ల మగ జాగ్వార్ కుశ మృతి చెందింది. 2019లో హైదరాబాదులోని నెహ్రూ జూలాజికల్ పార్క్ నుంచి బదిలీపై ఎస్వీ జూ పార్కుకు వచ్చింది. కాగా ఎప్పటిలాగే దానిని జూ ఆవరణంలోకి వదలగా దురదృష్టవశాత్తు ఒక చెట్టుకు చిక్కుకుపోయి మృతి చెందింది. దీంతో ఎస్వీ వెటర్నరీ విశ్వవిద్యాలయంలో పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేశారు.