RR: రాజేంద్రనగర్ సర్కిల్ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి రూ.30 కోట్ల నిధులను మంజూరు చేయించుకున్నామని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. తక్షణం రూ.10 కోట్లను మంజూరు చేశారని, సర్కిల్ పరిధిలోని 34 బస్తీలు, కాలనీల్లో రూ.10 కోట్లతో సీసీ రోడ్లు, బీటీ రోడ్లకు మరమ్మతులు చేస్తామన్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తి కాగానే పనులు ప్రారంభమవుతాయన్నారు.