సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలో శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం నిర్వహించన రథోత్సవంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రథోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.