BHPL: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైందని BRS నేతలు ఆరోపించారు. BHPL మున్సిపాలిటీలోని 12, 13 వార్డుల్లో BRS ఆధ్వర్యంలో “కాంగ్రెస్ బాకీ కార్డులను” ఇంటింటికి పంపిణీ చేశారు. రూ.2 లక్షల రుణమాఫీ, కల్యాణ లక్ష్మి, మహిళలకు రూ.2500, పెన్షన్ల పెంపు హామీలు అమలు కాలేదన్నారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు.