ప్రకాశం జిల్లా దొనకొండలోని నిర్మానుష్య ప్రాంతాలపై మంగళవారం సాయంత్రం పోలీసులు డ్రోన్ ఎగరవేసి పర్యవేక్షించారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.పేకాట, గంజాయి పెంపకం వంటి అసాంఘిక కార్యకలాపాలను సాంకేతిక పరిజ్ఞానంతో అరికట్టవచ్చని పోలీసులు పేర్కొన్నారు.