TG: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం వెంకన్నగూడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన రెండో భార్యను చున్నీతో ఉరివేసి, తలపై రాయితో కొట్టి చంపాడు. కుటుంబ కలహాలతోనే భార్య రజితను చంపినట్లు తెలుస్తోంది. ఆమె భర్త జంగయ్యకు రెండేళ్లుగా దూరంగా ఉంటోంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.