NGKL: అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. మంగళవారం రాత్రి అచ్చంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చారకొండ మండల ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కష్టపడాలన్నారు.