శ్రీకాకుళం: తూర్పుగోదావరి జిల్లాలోని ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నల్లజర్లలో ఇవాళ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఒక ప్రకటనలో చెప్పారు. ఈ జాబ్ మేళాలో 1014 పోస్టులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటిఐ, డిప్లమా, ఎంబీఏ వంటి కోర్సులు పూర్తి చేసి ఉండాలని చెప్పారు.