KMR: జిల్లాలో వచ్చిన భారీ వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి, కేంద్ర బృందం నేడు జిల్లాలోని పలు మండలాల్లో పర్యటించనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. భిక్నూర్ మండలం దాస్నంకుంట కట్ట తెగిన ప్రాంతం, KMR GR కాలనీ వద్ద బ్రిడ్జ్‌తో పాటు పోచారం ప్రాజెక్టు దెబ్బతిన్న ప్రాంతంతో పాటు పలు మండలాల్లో పర్యటించి పరిశీలించనున్నారు.