MNCL: జిల్లాలో భూగర్భ జలాల పరిమితి పెరిగిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. జిల్లాలో గత సంవత్సరం 43,545 ఇంకుడు గుంతలు, 5,372 సామాజిక ఇంకుడు గుంతలు జాతీయ ఉపాధి హామీ నిధుల ద్వారా ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఇంటికి 6 మొక్కల చొప్పున పంపిణీ చేసి వాటి సంరక్షించేలా చర్యలు తీసుకున్నామని, గత మూడేళ్లలో 45 లక్షల మొక్కలు నాటామని పేర్కొన్నారు.