NDL:ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో ప్రస్తుతం ఉన్న 24 వార్డులను 28 వార్డులుగా పెంచాలన్న పునర్విభజన తీర్మానాన్ని కౌన్సిల్ సభ్యులు తిరస్కరించారు. మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావనకు తీసుకురాగా వార్డుల విభజన ప్రక్రియ అడ్డగోలుగా ఉందని సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ తీర్మానాన్ని తిరస్కరించి వాయిదా వేశారు.