పంజాబ్(punjab)లోని లూథియానా(ludhiana)లో ఓ పాల ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీక్(milk factory Gas leak) ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో చాలా మంది స్పృహ తప్పి పడిపోయారు. 11 మంది మరణించినట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. మృతుల్లో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారని తెలిపారు. మరోవైపు ఆస్పత్రిలో చేరిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అన్నారు.
మరోవైపు ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. లూథియానా(ludhiana)లోని గియాస్పురా ప్రాంతంలో ఫ్యాక్టరీ గ్యాస్ లీక్ సంఘటన చాలా బాధాకరమైనదని పేర్కొన్నారు. పోలీసులు, ప్రభుత్వం, NDRF బృందాలు ఘటనా స్థలంలో ఉన్నాయి. సాధ్యమైన వరకు ప్రతి ఒక్కరికీ సహాయం అందించబడుతుందని వెల్లడించారు.
అధికారులు ఎన్డిఆర్ఎఫ్(NDRF) సిబ్బందిని పిలిపించి ఆ మొత్తం ప్రాంతాన్ని సీజ్ చేశారు. స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరారు. ఈ సంఘటన స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. వారిలో కొందరు ప్రాణాలను కాపాడుకోవడానికి తమ ఇళ్లను కూడా వదిలిపెట్టి పారిపోయినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.