»Two Storey Building Collapse 3 Dead 11 Injured At Bhiwandi Thane Maharashtra
Building collapse: కూప్పకూలిన రెండస్తుల భవనం.. ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు
రెండస్తుల భవనం ఆకస్మాత్తుగా కుప్పకూలింది(Building collapse). ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో 11 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం మహారాష్ట్ర థానేలోని భివాండి(bhiwandi thane maharashtra)లో చోటుచేసుకుంది.
మహారాష్ట్ర(maharashtra)లోని థానే(thane) జిల్లాలోని భివాండి(bhiwandi)లో శనివారం మధ్యాహ్నం రెండు అంతస్తుల భవనం కుప్పకూలడంతో(Building collapse) ముగ్గురు వ్యక్తులు మరణించారు. మరో 11 మంది గాయపడ్డారు. భవనం శిథిలాల కింద చిక్కుకున్న మరో 15 నుంచి 20 మందిని అధికారులు రక్షించేందుకు సహాయక చర్యలు చేపడుతున్నారు.
విషయం తెలుసుకున్న మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే(eknath shinde) మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఘటనా స్థలాన్ని కూడా ఆయన సందర్శించారు. పునరాభివృద్ధికి సంబంధించి కూడా త్వరలోనే పరిష్కరిస్తామని వెల్లడించారు. ఈ క్రమంలో వర్షాకాలంలో ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదకరమైన భవనాలను తప్పనిసరిగా సర్వే చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) రెండు బృందాలు, 10 అగ్నిమాపక యంత్రాల సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.
నాలుగు కుటుంబాలు పై అంతస్తులలో నివసిస్తున్నాయని, భవనం యొక్క గ్రౌండ్ ఫ్లోర్లో చాలా మంది కార్మికులు(labours) పని చేస్తున్నారని స్థానికులు చెప్పారు. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం కూలిన గోడౌన్ 10 ఏళ్ల క్రితం భవనమని తెలుస్తోంది.