ఏపీలోని రాజమహేంద్రవరం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే భవానీ(MLA Bhavani) భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్(వాసు)ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతోపాటు ఆయన తండ్రి, మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి అప్పారావును కూడా సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫైనాన్స్ విషయాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో వీరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు నెల రోజుల క్రితమే ఆదిరెడ్డి శ్రీనివాస్.. వైసీపీ ఎంపీ మార్గాని భరత్(mp bharath) పై విమర్శలు చేశారు. పబ్లిసిటి పేరుతో ప్రజా సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి చేయకుండా కొట్ల రూపాయల ప్రజాధనం వృథా చేస్తున్నారని మండి పడ్డారు. ఈ నేపథ్యంలో వీరిని అరెస్ట్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు శ్రీనివాస్ భార్య, అర్బన్ ఎమ్మెల్యే భవాని(MLA Bhavani) దివంగత టీడీపీ నేత ఎర్రం నాయుడు కుమార్తె. అంతేకాదు అచ్చెన్నాయుడు అన్న కుమార్తె కూడా. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో శ్రీనివాస్ కూడా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అధికార పార్టీపై ఆయన విమర్శలు చేస్తున్నట్లు సమాచారం.