చాట్‌జీపీటీ (Chatgpt )రూపకల్పతో టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన ఆల్ట్‌మన్‌ను ఓపెన్ ఏఐ సంస్థ సీఈవో బాద్యతలు నుంచి తప్పించింది. ఆయనపై విశ్వాసం లేకపోవడమే ఇందుకు కారణమని తెలిపింది. ఆల్ట్‌మన్ (Altman) చర్చల్లో నిజాయతీ పాటించడంలేదు. బోర్డు నిర్ణయాలకు అడ్డుపడుతున్నారు. అతడి సామర్థ్యంపై నమ్మకం లేదు. అతడి స్థానంలో తాత్కాలికంగా కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మిరా మురాటీ సీఈవోగా వ్యవహరిస్తారని కంపెనీ ప్రకటించింది. ఆల్ట్‌మన్ తొలగింపు నిర్ణయం టెక్ వర్గాల్లో సంచలనంగా మారింది. ఈ నిర్ణయంపై ఆల్ట్‌మన్ ఎక్స్‌వేదికగా స్పందించారు. ‘‘ఓపెన్ఏఐ (OpenAI) సంస్థలో పనిచేయడాన్ని ఎంతో ఇష్టపడ్డాను. వ్యక్తిగతంగా నేను మారడానికి, ప్రపంచాన్ని కొంచెం మారిందనడానికి నేను నమ్ముతున్నాను.
చదవండి : YSRCP: పొత్తు గురించి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
అన్నిటికంటే ముఖ్యంగా ఎంతో మంది ప్రతిభావంతులైన వారితో పనిచేయడాన్ని ఇష్టపడ్డాను’’ అని పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా పనిచేసే చాట్‌జీపీటీని ఇటీవల కాలంలో పరిచయం చేసినప్పుడు ప్రపంచమంతా నివ్వెరపోయింది. ఈ చాట్‌బోట్(Chatbot) సహాయంతో కేవలం సెకన్లలోనే మనకు కావాల్సిన కచ్చితమైన సమాచారాన్ని పొందవచ్చు. చాట్‌జీపీటీ ఉపయోగాలు ఎన్ని ఉన్నప్పటికీ అంతే సంఖ్యలో నష్టాలు సైతం ఉన్నట్లు నిపుణులు పేర్కొన్నారు. పలు రంగాల్లో ఉద్యోగాలు పోతాయని తెలిపారు. ఆల్ట్‌మన్ సైతం ఏఐతో పెనుప్రమాదం పొంచి ఉందని తెలిపారు. చాట్‌జీపీటీ కన్నా పవర్ఫుల్ ఏఐని డెవలప్ చేయగల సత్తా ఓపెన్ఏఐకి ఉన్నా.. ఇప్పటికిప్పుడే విడుదల చేసేందుకు తాము సుముఖంగా లేమని గతంలో ఆయన అన్నారు. యూజర్లు కూడా అందుకు సిద్ధంగా లేరని, తద్వారా తలెత్తే పరిణామాలను ఊహించడం కూడా కష్టమని గతంలో ఆల్ట్‌మన్ తెలిపారు. ఇక ఓపెన్ఏఐ సంస్థకు వెన్నెముకగా ఉన్న మైక్రోసాఫ్ట్ (Microsoft) బిలియన్లలో పెట్టుబడులు పెట్టింది. ప్రస్తుతం దీన్ని తన సెర్చ్ ఇంజిన్ బింగ్‌లో వాడుతున్నారు.
చదవండి : త్వరలో దేశాన్ని పాలిస్తాం..బీజేపీ, కాంగ్రెస్ తర్వాత మాదే పెద్ద పార్టీ

