»One Lakh Crore Income Adanis Re Entry Into The List Of Top 20 Billionaires
Gautam Adani: ఒక్కరోజే లక్ష కోట్ల ఆదాయం..టాప్20 బిలియనీర్స్ లిస్ట్‌లోకి అదానీ రీఎంట్రీ
అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ నికర విలువ ఒక్కసారిగా పెరిగింది. ఒక్క రోజే రూ.లక్ష కోట్ల ఆదాయం రావడంతో సంపన్నుల జాబితాలో ఆయన మరో రెండు స్థానాలు ఎగబాకారు. దీంతో ఆయన ప్రపంచ కుబేరుల్లో టాప్20 జాబితాలోకి ఎంట్రీ ఇచ్చారు.
అదానీ గ్రూప్ అధిపతి అయిన గౌతమ్ అదానీ (Gautam Adani) తన హవాను మళ్లీ కొనసాగిస్తున్నాడు. దేశంలోనే రెండో అత్యంత ధనవంతుడైన అదానీ సంపద మరోసారి బాగా పెరిగింది. దీంతో ప్రపంచంలోనే టాప్20 సంపన్నుల జాబితాలోకి గౌతమ్ అదానీ పేరు ఎంటర్ అయ్యింది. తాజాగా అదానీ గ్రూప్ (Adani Group) మార్కెట్ విలువ ఏకంగా రూ.లక్ష కోట్లు పెరగడంతో షేర్ హొల్డర్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆస్తుల విలువ పెరగడంతో బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ల జాబితాలో 2 స్థానాలను మెరుగుపరుచుకుని టాప్20 లోకి అదానీ తిరిగి వచ్చారు. అంతకుముందు అదానీ 22వ స్థానంలో ఉండటం విశేషం.
నికర విలువ (NetWorth) 6.5 బిలియన్ డాలర్లు పెరిగి 66.7 బిలియన్లను దాటింది. అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల షేర్లు (Adani companies Shares) 20 శాతం వరకూ లాభాలను పొందాయి. మంగళవారం ట్రేడింగ్ (Trading) ముగిసే సమయానికి రూ.11.31 లక్షల కోట్లకు పెరిగాయి. దీంతో కేవలం 24 గంటల వ్యవధిలో రూ.1.04 లక్షల కోట్లు ఆదాయం పెరిగింది. అదానీ గ్రూప్ షేర్లు (Adani Group Shares) ఒక్కరోజులోనే ఇంతలా పెరగడం ఇదే మొదటి సారి కావడం విశేషం.
ఇకపోతే ప్రపంచ సంపన్నుల జాబితాలో ముకేష్ అంబానీ (Mukesh Ambani) 13వ స్థానంలో కొనసాగుతున్నాడు. బ్లూమ్‌బెర్గ్ ప్రపంచ బిలియనీర్ల జాబితాలో మన దేశంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా ముకేష్ అంబానీ నిలిచారు. ముకేష్ అంబానీ నికర ఆదాయం విలువ దాదాపు 89.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ ఏడాదిలో ఆయన సంపద 2.34 బిలియన్ డాలర్లు పెరగడం విశేషం. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) ఉన్నారు. ఆయన సంపద విలువ 228 బిలియన్ డాలర్లు కాగా రెండో స్థానంలో ఉన్న అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ సంపద విలువ 171 బిలియన్ డాలర్లుగా ఉంది.