»Good News For Investors Ipo Fair In 11 Companies Next Week
IPO: ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్..వచ్చేవారం 11 కంపెనీల్లో ఐపీఓల జాతర
ఈమధ్యకాలంలో పెద్ద పెద్ద కంపెనీలు సైతం నిధుల సమీకరణ కోసం ఐపీఓలకు వెళ్తున్నాయి. తాజాగా ఈ వారంలో 11 కంపెనీలు ఐపీఓలకు వస్తున్నట్లు తెలిపాయి. వచ్చే ఏడాది ఐపీఓకు వచ్చేందుకు 65 సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి.
ఇన్వెస్టర్లు ఎప్పటి నుంచో చూస్తున్న తరుణం వచ్చేసింది. వచ్చేవారం 11 కంపెనీలు ఐపీఓలకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు సమాయత్తం అవుతున్నారు. ప్రస్తుతం దేశంలో ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ ఐపీఓల సీజన్ నడుస్తోంది. టాటా టెక్, ఫ్లెయిర్, గాంధార్ ఆయిల్ వంటి ఐపీఓలు గత కొద్ది రోజులకు ముందే మార్కెట్లోకి వచ్చి అద్భుతంగా దూసుకుపోతున్నాయి. ఈ తరుణంలో మరిన్ని కంపెనీలు నిధుల సమీకరణకు సిద్దం అవుతున్నాయి.
వచ్చేవారం ఏకంగా 11 కంపెనీలు ఐపీఓకు రావడంతో ఇన్వెస్టర్లు సిద్ధమవుతున్నారు. ఐపీఓకు వస్తున్న కంపెనీల్లో ముత్తూట్ మైక్రోఫిన్, మోతీసన్స్ జువెలర్స్, హ్యాపీ ఫోర్జింగ్స్ వంటివి ఏడు మెయిన్ బోర్డు ఐపీఓలు ఉండటం విశేషం. అదేవిధంగా ఎస్ఎంఈ సెగ్మెంట్లో కూడా మరో నాలుగు కంపెనీలు ఐపీఓకు వచ్చాయి. ముఫ్తీ జీన్స్, సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్, ఆర్బీజడ్ జువెలర్స్, ఆజాద్ ఇంజినీరింగ్ వంటివి నిధుల సమీకరణకు ముందుకొచ్చాయి.