స్మార్ట్ టీవీలపై అమెజాన్ బంపరాఫర్ ప్రకటించింది. 50 శాతం డిస్కౌంట్‌తో అతి ధక్కువ ధరకే ఆ స్మార్ట్ టీవీలను సొంతం చేసుకోవచ్చు. అద్భుతమైన ఫీచర్లతో తక్కువ ధరకే లభించే ఆ స్మార్ట్ టీవీలపై ఓ లుక్కేయండి.
అమెజాన్ (Amazon) నిర్వహిస్తున్న ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ ఫైనల్ డేస్’ (Great Indian Festival Sales Finale Days) ముగింపు దశకు చేరుకున్నాయి. దీంతో స్మార్ట్ టీవీలపై (SmartTv’s) అమెజాన్ బంపరాఫర్ ప్రకటించింది. చైనాకు చెందిన షావోమీ వంటి బ్రాండ్స్, సోనీ, సామ్సంగ్ ఇలా స్టార్ బ్రాండ్స్‌పై అమెజాన్ తక్కువ ధరకే స్మార్ట్ టీవీలను విక్రయించనుంది. స్మార్ట్ టీవీలపై ఏకంగా 50 శాతం వరకూ డిస్కౌంట్స్‌ను అమెజాన్ అందించనుంది. ఈ తరుణంలో అమెజాన్ సైట్లో ఏయే స్మార్ట్ టీవీలు, ఎంత డిస్కౌంట్స్‌తో లభిస్తాయో ఓసారి తెలుసుకుందాం.
సోనీ 43 ఇంచెస్:సోనీకి చెందిన 43 ఇంచెస్ ఈ స్మార్ట్ టీవీ అసలు ధర రూ.69.900 ఉండగా 44 శాతం డిస్కౌంట్‌ను అమెజాన్ అందించనుంది. దీంతో ఈ టీవీ రూ.39,490లకే లభించనుంది. ఈ టీవీలో 4కే అల్ట్రా హెచ్డీ డిస్ప్లే, అలాగే గూగుల్ టీవీలో యూఎస్బీ పోర్ట్స్, 20 వాట్స్ అవుట్‌పుట్ డాల్బీ ఆడియో స్పీకర్, వాయిస్ సెర్చ్, అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ టీవీపై 3 సంవత్సరాల పాటు వారంటీ అనేది ఉంటుంది.
షావోమీ 43 ఇంచెస్:షావోమీకి చెందిన ఈ 43 ఇంచెస్ టీవీ ధర రూ.42,999లు. అయితే అమెజాన్ ఈ స్మార్ట్ టీవీపై 43 శాతం డిస్కౌంట్ అందించనుంది. దీంతో ఈ టీవీ రూ.24,499లకే లభించనుంది. ఇందులో ఎల్ఈడీ డిస్ప్లే, 4కే రిజల్యూషన్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఫీచర్లు లభించనున్నాయి. 30 వాట్స్ అవుట్‌పుట్ డాల్బీ ఆడియో ఉంటుంది. అలాగే ఈ టీవీకి ఒక ఏడాది పాటు వారంటీని అమెజాన్ అందించనుంది.
వన్‌ప్లస్ 50 ఇంచెస్: వన్‌ప్లస్ 50 ఇంచెస్ టీవీని రూ. 31,890కే అమెజాన్ అందించనుంది. ఇక 43 ఇంచెస్ టీవీని రూ.24,999కే సొంతం చేసుకోవచ్చు. ఈ టీవీలో 4కే అల్ట్రా హెచ్డీ బెజల్ లెస్ డిస్ప్లే, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో, హాట్ స్టార్, సోనీ లివ్, జియో ఫీచర్లతో పాటు మరికొన్ని ఓటీటీ యాప్స్ సపోర్ట్ చేస్తాయి.
అసర్ 50 ఇంచెస్: ఈ కంపెనీకి చెందిన 50 ఇంచెస్ స్మార్ట్ టీవీ ధర రూ.49,999లు కాగా దీనిపై 48 శాతం డిస్కౌంట్ లభించనుంది. దీంతో ఈ టీవీ రూ.25,999కే సొంతం చేసుకోవచ్చు. ఇందులో ఎల్ఈడీ డిస్ప్లే, 4కే రిజల్యూషన్ స్క్రీన్, డ్యూయల్ బాండ్ వైఫై, 2వే బ్లూటూత్, బ్లూరే స్పీకర్, 36 వాట్స్ అవుట్‌పుట్ డాల్బీ ఆటమ్స్ సౌండ్ ఫీచర్లు ఉన్నాయి.
సామ్సంగ్ 43 ఇంచెస్: ఈ కంపెనీకి చెందిన 43 ఇంచెస్ స్మార్ట్ టీవీ ధర రూ.52,900. అయితే దీనిపై 46 శాతం డిస్కౌంట్ లభించనుంది. దీంతో ఈ స్మార్ట్ టీవీని రూ.28,490లకే సొంతం చేసుకోవచ్చు. ఇకపోతే ఇందులో 4కే అల్ట్రా హెచ్డీ డిస్ప్లే, 3 హెచ్డీఎంఐ పోర్ట్స్, వైఫై, బ్లూటూత్ కనెక్టివిటీ, 20 వాట్స్ అవుట్‌పుట్ సౌండ్ ఫీచర్లు ఉన్నాయి.