రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ దేశంలోనే టాప్ సీఈఓగా నిలిచారు. బ్రాండ్ విలువను కాపాడే సామర్థ్యపరంగా ముకేశ్ అంబానీ దేశంలో ఫస్ట్ ప్లేస్ లోకి వచ్చారు. గ్లోబల్‌గా మైక్రోసాఫ్ట్ సత్య నాదెళ్ల, గూగుల్ సీఈఓ సుందర్ పిచయ్, యాపిల్ టిమ్ కుక్, టెస్లా ఎలన్ మస్క్ వంటి సీఈఓలను దాటి రెండో ప్లేస్‌ను దక్కించుకున్నారు. తాజాగా బ్రాండ్ గార్డియన్షిప్ ఇండెక్స్ 2024 ప్రకారం, టెన్సంట్ కంపెనీ సీఈఓ హుటాంగ్ మా టాప్ సీఈఓగా నిలిచారు.
ఉద్యోగులు, ఇన్వెస్టర్లు, సొసైటీ మధ్య బ్యాలెన్స్ కొనసాగిస్తూ బిజినెస్‌ను డెవలప్ చేసిన గ్లోబల్ సీఈఓలతో కూడిన జాబితాను బ్రాండ్ గార్డియన్షిప్ రిలీజ్ చేస్తోంది. ఇందుకోసం స్థిరంగా బిజినెస్ బ్రాండ్ పెంచడం, ఉద్యోగులు, ఇన్వెస్టర్స్ సహా అన్ని వర్గాలకు లబ్ధి చేకూర్చడం లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంది.
బ్రాండ్ గార్డియన్ సూచీ- 2024 ప్రకారం.. గతేడాది 8వ స్థానంలో ఉన్న టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ఈసారి అయిదో స్థానానికి చేరారు. మహీంద్రా గ్రూప్ సీఈఓ అనీశ్ షాకు 6వ ర్యాంకు లభించింది. ‘డైవర్సిఫైడ్ కాంగ్లమరేట్స్’ విభాగంలో అంబానీ తొలిస్థానం దక్కించుకున్నారు. బ్రాండ్ ఫైనాన్స్ సర్వేలో అంబానీకి 80.3 స్కోర్ రాగా..చైనీస్ బిజినెస్ మ్యాన్ హుటాంగ్ మాకు 81.6 స్కోర్ వచ్చింది.