»Amazon When Does The Amazon Great Summer Sale Start
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ ఎప్పటి నుంచి ప్రారంభమంటే?
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ సమ్మర్ బిగ్ సేల్ ప్రారంభం కానుంది. ఏటా గ్రేట్ సమ్మర్ సేల్‌ను నిర్వహిస్తారు. అయితే తాజాగా ఈ తేదీని ప్రకటించింది. మరి ఈ గ్రేట్ సేల్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందో తెలుసుకుందాం.
Amazon: When does the Amazon Great Summer Sale start?
Amazon: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ సమ్మర్ బిగ్ సేల్ ప్రారంభం కానుంది. ఏటా గ్రేట్ సమ్మర్ సేల్‌ను నిర్వహిస్తారు. అయితే తాజాగా ఈ తేదీని ప్రకటించింది. మే 2 మధ్యాహ్నం నుంచి ఈ సేల్ ప్రారంభం కానుంది. అయితే ఈ సేల్ ఎప్పుడు ఎండ్ అవుతుందనే విషయం వెల్లడించలేదు. అమెజాన్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్ కూడా బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రారంభం కానుంది మే 3 నుంచి మే 9 వరకు ఈ సేల్ నిర్వహించనుంది. అయితే ప్రైమ్ మెంబర్లకు మే 1 అర్థరాత్రి 12 తర్వాత సేల్ మొదలుకానుంది. ఈ సేల్‌లో భాగంగా అందించే డిస్కౌంట్లు, డీల్స్‌ను ప్రైమ్ చందాదారులు అందరికంటే ముందుగానే పొందవచ్చు.
ఈ సమ్మర్ సేల్‌లో భాగంగా ఐసీఐసీఐ బ్యాంక్, వన్ కార్డ్, బ్యాంక్ ఆఫ్ బరోడా డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు దారులకు 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ దొరుకుతుంది. ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. సేల్ సమయంలో చేసే ఫస్ట్ ఆర్టర్‌పై ఫ్రీ డెలివరీ ఉండటంతో పాటు వెల్కమ్ రివార్డు పేరుతో 20 శాతం క్యాష్‌బ్యాక్ కూడా ఇవ్వనుంది. అమెజాన్ అలెక్సా డివైజ్‌లు, ఫైర్‌టీవీ, కిండ్లే డివైజుల మీద ఈ సేల్‌లో డిస్కౌంట్లు లభించనున్నాయి. సేల్ సమయంలో యాపిల్, శాంసంగ్, వన్‌ప్లస్, రెడ్మీ, నార్జో, ఐకూ, పోకో, హానర్, టెక్నో వంటి స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్లు ఇవ్వనున్నట్లు కంపెనీ తెలిపింది. వేటిపై ఎంతెంత డిస్కౌంట్ అనేది తెలియదు. త్వరలో ఈ వివరాలు వెల్లడి కానున్నాయి. వీటితో పాటు కొత్తగా మార్కెట్లోకి వచ్చిన స్మార్ట్ఫోన్లపై భారీ ఎత్తున డిస్కౌంట్లు అందిచనున్నట్లు తెలుస్తోంది.