»Vivo These Are The Features Of Vivos New Phone With Leather Finish
Vivo: లెదర్ ఫినిష్‌తో వివో కొత్త ఫోన్ ఫీచర్లు ఇవే!
వివో(Vivo) కంపెనీ తన ‘Y’ సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. వివో వై200 5జీ(Vivo Y200 5G) పేరుతో లాంచ్ చేసింది. మరి దీని ధర, వివరాలేంటో తెలుసుకుందాం.
Vivo: వివో(Vivo) కంపెనీ తన ‘Y’ సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. వివో వై200 5జీ(Vivo Y200 5G) పేరుతో లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్ 14, డ్యుయల్ కెమెరాతో రానున్న ఈ ఫోన్ ప్రీ బుకింగ్‌లు ఇప్పటికే మొదలయ్యాయి. వివో వై200 5జీ మొబైల్ రెండు వేరియంట్స్‌లో లభిస్తుంది. 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.19,999గా కంపెనీ పేర్కొంది. 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.20,999గా నిర్ణయించింది. సాఫ్రాన్ డిలైట్ లెదర్ ఫినిష్, బ్లాక్ డైమండ్ ప్లాస్టిక్ ప్యానెల్‌తో ఈ ఫోన్ రానుంది.
హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్ ద్వారా వివో వెబ్సైట్ నుంచి ప్రీ బుకింగ్ చేసుకున్నవారు రూ.1,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఎంపిక చేసిన బ్యాంక్ కస్టమర్లకు ఆరు నెలల నో- కాస్ట్ ఈఎంఐ సదుపాయం అందిస్తోంది. ఫిబ్రవరి 29 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. మొబైల్ విక్రయాలు ఎప్పటి నుంచి ప్రారంభం కానున్నాయనే విషయాన్ని కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఫ్లిప్‌కార్ట్ వెబ్సైట్లో మార్చి 1 నుంచి కొనుగోలు చేయవచ్చు.
వివో కొత్త మొబైల్లో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఇచ్చారు. ఇది 120Hz రిఫ్రెష్ రేటుతో పనిచేస్తుంది. 1,800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఇస్తుంది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 4జెన్ 2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్టచ్ఓఎస్ 14తో వస్తోంది. కెమెరా విషయానికొస్తే.. వెనకవైపు 50ఎంపీ ప్రధాన కెమెరా, 2ఎంపీ సెన్సర్ ఇచ్చారు. వీడియో కాల్స్, సెల్ఫీల కోసం ముందు వైపు 16 ఎంపీ కెమెరా ఉంది. 5,000mAh బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్ 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. మైక్రో ఎస్డీ కార్డ్ సాయంతో 1టీబీ వరకు స్టోరేజీ పెంచుకొనే సదుపాయం ఉంది.