SS: సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ దృష్ట్యా వివిధ డిపోల నుంచి పుట్టపర్తికి వచ్చే బస్సుల పార్కింగ్ స్థలాన్ని అధికారులు మార్చారు. ప్రస్తుతం బస్సులన్నింటికీ పట్టణంలోని కమ్మవారిపల్లి వద్ద ప్రత్యేక పార్కింగ్‌ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. భక్తులు, డ్రైవర్లు ఈ మార్పును గమనించి సహకరించాలని కోరారు.