Ajay Devgn : నిమిషానికి రూ. 4.5 కోట్లు వసూలు చేసిన ఆ హీరో ఎవరంటే!
ప్రస్తుతం భారత దేశ వ్యాప్తంగా ఉన్న టాప్ హీరోలాంతా వారి వారి రేంజ్‌ని బట్టి వంద కోట్ల నుంచి రెండొందల కోట్ల వరకు పారితోషికాన్ని వసూలు చేస్తున్నారు. అయితే ఓ హీరో మాత్రం సినిమాలో ఎనిమిది నిమిషాలు కనిపించడానికి రూ. 35 కోట్లు తీసుకున్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరు? ఏంటా సినిమా? తెలుసుకుందాం పదండి.
Ajay Devgn Guest Role Remuneration : ఇప్పుడు మన టాలీవుడ్ హీరోలతో పాటు, భారత దేశంలో టాప్ హీరోలుగా వెలుగొందుతున్న వారంతా సినిమాకి వంద కోట్లు తక్కువ కాకుండా పారితోషికాన్ని అందుకుంటున్నారు. కొందరు రెమ్యునిరేషన్తో పాటు సినిమా లాభాల్లోనూ వాటా తీసుకుంటారు. ఇలా దాదాపుగా రెండొందల కోట్ల రూపాయల వరకు తీసుకుంటారని వినికిడి. అయితే నిమిషానికి నాలుగున్నర కోట్లు వసూలు చేసిన నటుడు ఒకరు ఉన్నారు. ఆయనెవరంటే…
2021లో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ నటించారు. ఆ సినిమాలో ఉన్నఫ్లాష్ బ్యాక్‌లో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. అయితే దానిలో ఆయన కనిపించింది కేవలం ఎనిమిది నిమిషాలు మాత్రమే. ఆ గెస్ట్ రోల్ కోసం ఆయన రూ.35 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే ఆయన కనిపించిన ఒక్కో నిమిషానికి దాదాపుగా రూ.4.5 కోట్ల వంతున వసూలు చేసుకున్నారు.
ఈ పారితోషికం విషయాన్ని తెలుసుకున్న ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో అజయ్ దేవగణ్ (Ajay Devgan)నటించిన సీన్ల నిడివి తక్కువే అయినా ఆ పాత్ర అక్కడ చాలా కీలకంగా ఉంటుంది. అందువల్లనే ఈ అతిథి పాత్ర(Guest Role)కు ఆయన అంత పెద్ద పారితోషికాన్ని వసూలు చేసినట్లు తెలుస్తోంది.