Vegitable Fruites : మీకు తెలుసా? దోసకాయ… పచ్చిమిర్చి… ఇవన్నీ పండ్లట!
మనం వంట చేసుకుని తినేవన్నీ కూరగాలయలనే అంటాం. ఊరికే ముక్కలు కోసుకుని తినగలిగిన తియ్యటి రసం నిండినవన్నీ పండ్లనే అంటాం. మరి మీకు తెలుసా? మనం కూరగాయలనుకునే చాలా రకాలు నిజానికి పండ్లట.
Vegetables that are actually FRUITS : మనం రోజూ వండుకునే కూరగాయల్లో గుమ్మడి, దోస, పచ్చిమిర్చి లాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ అసలు కూరగాయలే కాదట. నిజానికి అవి పండ్ల విభాగంలోనివట. మరి మనం వంటల్లో ఉపయోగించుకునే ఏమేమి రకాలు అసలు పండ్లో తెలుసుకుందాం రండి.
స్క్వేష్లు, గుమ్మడి కాయలు, దోస కాయలు, కీర దోసకాయలు, పుచ్చ కాయలు… ఇవన్నీ కుకుర్బిట్ కుటుంబానికి చెందిన పండ్లు. వీటిలో మనం పుచ్చకాయల్లాంటి వాటినే పండ్లని భావిస్తాం. కానీ గుమ్మడికాయలు, దోసకాయల్లాంటివీ కూరగాయలు(Vegetables) కాదట. పండ్లేనట. అలాగే గుత్తి వంకాయ కూరలు, వంకాయ పచ్చళ్లు, వంకాయ వేపుళ్లు అంటూ మనం వంకాయల్ని బోలెడు రకాలుగా వండేసుకుంటుంటాం కదా. మరి వంకాయ కూడా పండా? అని ఆశ్చర్యపోకండలా. అవునండీ నిజంగా వంకాయ పండేనట.
టమాటాలను మనం ఎక్కువగా వంటల్లో వాడుతుంటాం. ప్రతి కూరకూ ఇది మంచి రుచిని ఇస్తుంది. అయితే ఇవి మొదట్లో దక్షిణ అమెరికా ఎడారుల్లో పండేవట. అప్పుడు అవి రుచిలో కాస్త చేదుగా ఉండేవట. వీటికి క్రమంగా రుచిని మారుస్తూ, కాస్త పుల్లదనాన్ని, తీపిదనాన్ని యాడ్ చేస్తూ జన్యు మార్పిడి చేస్తూ వచ్చారట. అందుకనే గమనిస్తే ఇప్పుడు మనకు దొరికే టమాటాల రుచుల్లో, రంగుల్లో చాలా తేడాలుంటాయి. ఇవి నిజానికి పండ్ల(fruits) జాతిలోకి వస్తాయి. మనం కారం కోసం కూరల్లో పచ్చిమిర్చిని వేస్తుంటాం. అలాగే వీటి జాతికి చెందిన క్యాప్సికంలు, బజ్జీ పచ్చి మిర్చి లాంటివి ఉంటాయి. వీటిలో చాలా కారంగా ఉండే రకాలతో పాటు, కాస్త తీపి రుచి ఉన్నవీ ఉంటాయి. తీపిగా ఉన్న వాటిని మన దగ్గర తక్కువ వాడతారు. పాశ్చాత్య దేశాల్లో వీటిని ఎక్కువగా సలాడ్లలో తింటుంటారు. ఇవి నిజానికి పండ్లట. అలాగే జొన్న కండెలు కూడా ఆశ్చర్యకరంగా పండ్లేనట.