WhatsApp : వాట్సాప్‌లో కొత్త టెక్ట్స్ ఫార్మాటింగ్ ఫీచర్స్
వాట్సాప్‌లో టెక్ట్స్‌ని మరింత అందంగా, ఆకర్షణీయంగా మార్చేందుకు ఇప్పుడు పెద్దగా ఆప్షన్లు ఏమీ లేవు. అయితే ఇప్పుడు సంస్థ కొత్త ఫార్మాటింగ్ ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
WhatsApp Text Formatting Features : మనం వాట్సాప్ ద్వారానే చాలా పనులను చేసేసుకుంటూ ఉంటాం. అంతగా ఇది మన జీవితంలో భాగం అయిపోయింది. అందుకనే వాట్సాప్(WhatsApp) వినియోగదారులకు భద్రత విషయంలో, ఎక్స్పీరియన్స్ విషయంలో ఎప్పుడూ కొత్త కొత్త ఫీచర్లను తీసుకొచ్చేందుకు సంస్థ ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా నాలుగు కొత్త టెక్ట్స్ ఫార్మాటింగ్ పీచర్లను తీసుకొచ్చింది. ఆ వివరాలు ఏమంటే…
మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ తన వాట్సాప్ ఛానల్ ద్వారా కొన్ని విషయాలను వెల్లడించారు. వాటి ప్రకారం చూసుకున్నట్లైతే తాజాగా 4 టెక్ట్స్ ఫార్మాటింగ్ ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. ఎవరైనా అఫీషియల్‌గా మెసేజ్‌లు పంపించాలని అనుకునే వారికి ఈ ఫీచర్లు ఎక్కువ ఉపయోగకరంగా ఉంటాయి.
అఫిషియల్ మెసేజుల్లో నంబరింగ్, ఇన్లైన్ కోడ్, బ్లాక్ కోట్, బుల్లెట్స్ లాంటి వాటిని సులభంగా మార్చేందుకు వీలవుతుంది. టెక్ట్స్‌ని బుల్లెట్స్ రూపంలో అందించాలనుకుంటే ఆ వాక్యం ముందు ‘-‘ టైప్ చేయాలి. కంప్యూటర్లో అయితే Shift + Enter ను టైప్ చేస్తే తర్వాత వాక్యానికి కూడా బుల్లెట్ పాయింట్ వచ్చేస్తుంది. ఒక వేళ మీకు నంబర్డ్ లిస్ట్ కావాలనుకుంటే టెక్ట్స్ ముందు ‘1, 2, 3’ ఇలా అంకెలను టైప్ చేయాలి. ఇది కూడా బుల్లెట్ పాయింట్స్ మాదిరిగానే పని చేస్తుంది. సుదీర్ఘమైన టెక్ట్స్‌లో ఇంపార్టెంట్ పాయింట్లను హైలైట్ చేసేందుకు ఆ వాక్యాల ముందు ‘>’ ని టైప్ చేయాలి. ఇదే బ్లాక్ కోట్. బ్యాక్‌గ్రౌండ్‌తో సహా వాక్యాన్ని హైలైట్ చేసేందుకు ఇన్లైన్ కోడ్ చిహ్నాల “మధ్యన పదాలు ఉంచాలి.