Prabhas: ఒకే సినిమాలో ప్రభాస్, బాలయ్య గెస్ట్ రోల్?
ప్రభాస్, బాలయ్య.. కలిసి ఆహా అన్‌స్టాపబుల్ టాక్ షోలో కనిపిస్తేనే సర్వర్లన్నీ క్రాష్ అయిపోయాయి. అలాంటిది.. ఈ ఇద్దరు ఒకే సినిమాలో కనిపిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి మంచు విష్ణు సినిమా కోస గెస్టులుగా మారుతున్నారట.
Prabhas: ప్రభాస్ సినిమాలో బాలయ్య.. బాలయ్య సినిమాలో ప్రభాస్ కనిపించే అవకాశాలు చాలా తక్కువ. కాని.. మంచు విష్ణు మాత్రం ఈ క్రేజీ కాంబినేషన్‌ను సెట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మంచు విష్ణు ‘కన్నప్ప’ అనే భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ శివుడిగా కనిపించబోతున్నాడు. పార్వతీదేవిగా నయనతార, కంగనా రనౌత్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే.. కన్నప్ప పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో.. ప్రభాస్‌తో పాటు బిగ్ స్టార్ క్యాస్టింగ్ క్యామియో రోల్స్ చేస్తున్నట్టుగా సమాచారం. కన్నడ నటుడు శివరాజ్ కుమార్, మలయాళ హీరో మోహన్ లాల్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించబోతున్నారట. ఇక ఇప్పుడు నందమూరి బాలకృష్ణ కూడా కన్నప్పలో ముఖ్య పాత్రలో నటించే ఛాన్స్ ఉందనే వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమా సెకండ్ హాఫ్‌లో వచ్చే ఒక ఐదు నిమిషాల కీలక పాత్ర కోసం బాలయ్యను ట్రై చేస్తున్నట్టుగా తెలుస్తోంది. గతంలో కూడా మంచు మనోజ్ నటించిన ‘ఊ కొడతారా ఉలిక్కిపడతారా..’ సినిమాలో ఒక పాత్రలో కనిపించాడు బాలకృష్ణత. ఇక ఇప్పుడు విష్ణు కోసం బాలయ్య ఓకె చెప్పే ఛాన్స్ లేకపోలేదు. అసలు ఇందులో నిజమెంతో తెలియదు గానీ.. కన్నప్ప సినిమాలో ప్రభాస్, బాలయ్య కనిపిస్తే మాత్రం.. మామూలుగా ఉండదనే చెప్పాలి. మొత్తంగా కన్నప్ప సినిమాను మాత్రం ఓ రేంజ్లో ప్లాన్ చేస్తున్నాడు మంచు విష్ణు. మరి కన్నప్పలో ఎవరెవరు నటిస్తున్నారో తెలియాలంటే.. రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.