»Rajinikanth Charges Record Remuneration For Lal Salaam
Rajinikanth: లాల్ సలామ్ కి రజినీకాంత్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం లాల్ సలామ్ ఫిబ్రవరి 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో రజినీకాంత్ అతిధి పాత్ర పోషిస్తున్నారు. మరి ఇందులో రజినీకాంత్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసుకుందాం.
Rajinikanth: ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం లాల్ సలామ్ ఫిబ్రవరి 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ యాక్షన్ డ్రామాలో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలు పోషించారు. అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ మూవీలో అతిథి పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ బజ్ ఉంది. ఓపెనింగ్స్, పబ్లిక్ ఆసక్తి ఇప్పుడు సూపర్ స్టార్ మీదే ఆధారపడి ఉంది.
30-40 నిమిషాల స్క్రీన్ స్పేస్ ఉండే ఈ చిత్రంలో రజనీకాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కనిపించేది చాలా తక్కువ సమయం అయినా.. రజనీకాంత్ 40 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. ఈ సినిమా ఆడియో లాంచ్ ఇటీవలే జరిగింది. ఇందులో దర్శకురాలు ఐశ్వర్య, సూపర్ స్టార్ స్వయంగా సినిమా ప్రత్యేకమైన కాన్సెప్ట్ గురించి సుదీర్ఘంగా మాట్లాడారు. ఒక గ్రామంలో రెండు వర్గాల మధ్య తలెత్తిన సమస్యని క్రికెట్ ద్వారా పరిష్కరించేందుకు ప్రయత్నించే ముస్లిం పెద్దమనిషిగా రజనీకాంత్ కనిపిస్తారు. సెకండ్ హాఫ్‌లో ఎంట్రీ ఉంటుందని టాక్.
బిజినెస్ కోసం ట్రైలర్ లో ఎక్కువగా హైలైట్ చేశారు కానీ కేవలం ఆయన్ను నమ్ముకుని వెళ్లకూడదని అంతర్గతంగా వినిపిస్తున్న మాట. ఏది ఏమైనా అంచనాల విషయంలో వెనుకబడ్డ లాల్ సలామ్ కు రజని కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ పెట్టారు. ఐశ్వర్య రజనీకాంత్ లాల్ సలామ్ చిత్రంతో దాదాపు 5 సంవత్సరాల తర్వాత దర్శకురాలిగా తిరిగి వస్తోంది. ఈ చిత్రానికి సంగీతం ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకుర్చారు. సాంకేతిక బృందంలో సినిమాటోగ్రాఫర్ విష్ణు రంగసామి, ఎడిటర్ ప్రవీణ్ బాస్కర్ వ్యవహరిస్తున్నారు.